విజయ్ దేవరకొండ ఉద్వేగానికి లోనయ్యాడట !

Published on May 15, 2019 1:06 pm IST

యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, క్రేజీ బ్యూటీ రష్మిక మండన్న రెండవ సారి జంటగా నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ చిత్రం నుండి తాజాగా ‘కడలల్లే కన్నులే..’ అనే లిరికల్‌ వీడియో సాంగ్ ను విజయ్‌ దేవరకొండ తన ట్విటర్‌ ఎకౌంట్ లో పోస్ట్ చేశారు.

అయితే విజయ్ సాంగ్ ని పోస్ట్ చేస్తూ.. ‘ఓ ఉదయం నేను నిద్రలేవగానే నాకు భరత్‌ నుంచి ‘కడలల్లే కన్నులే..’ పాట తాలూకు ఆడియో ఫైల్‌ మెసేజ్‌ వచ్చింది. అది వినగానే నేను వెంటనే ఉద్వేగానికి లోనయ్యాను. ఆ తరువాత ఈ సాంగ్ ను ఇంట్లో ప్లే చేస్తున్నప్పుడు అమ్మ కళ్ళమ్మటి కూడా నీళ్లు రావడం చాలాసార్లు చూశాను. మరి ఈ సాంగ్ ఇప్పుడు మీకోసం. వినండి’ అని పేర్కొంటూ విజయ్ సాంగ్ ను పోస్ట్ చేశారు. మొత్తానికి విజయ్ ను ‘కడలల్లే కన్నులే..’ పాట ఉద్వేగానికి లోనుచేసిందన్నమాట.

ఇక భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్నీ మైత్రీ మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా జస్టిన్‌ ప్రభాకరణ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం జూలై 26వ తేదీన అన్ని సౌత్ భాషల్లో విడుదల కానుంది.

లిరికల్‌ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం :

More