సుశీల పాత్ర బాగా నచ్చింది -షాలిని పాండే !

Published on May 27, 2018 1:54 pm IST

అర్జున్ రెడ్డి సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన నటి షాలిని పాండే . ఈ సినిమాలో తన పెర్ఫార్మన్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది . ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే ఈ సినిమా తరువాత షాలిని మహానటి సినిమా లో సుశీల పాత్రలో నటించింది .ఇటీవల విడుదలైన ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది .

తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఈ సినిమాలోని సుశీల పాత్ర గురించి షాలిని మాట్లాడుతూ మహానటిలోని సుశీల పాత్రా నాకు చాలా బాగా నచ్చింది . సావిత్రి చిన్ననాటి స్నేహితురాలిగా అమాయకంగా కనిపిస్తూ స్నేహితురాలిపట్ల కుమిలిపోయే పాత్రలో నటించాను. ఇప్పుడు ఈ పాత్రకి వస్తున్న రెస్పాన్స్ కి చాలా సంతోషంగా ఉంది . నాకు తెలిసి పాత్రా చిన్నదా పెద్దదా అని నాకు ముఖ్యం కాదు మనకు ఇచ్చినా పాత్రకు న్యాయం చేశామా లేదా అనేదే ముఖ్యం అని వివరించింది .

ఇలా నటించిన రెండు సినిమాలతో పెద్ద విజయాలను తన ఖాతా లో వేసుకున్న షాలిని కి ఇకముందు తను నటించే సినిమాలు కూడా మంచి విజయాలను సాధించాలని కోరుకుందాం .

సంబంధిత సమాచారం :