కన్నడ సూపర్ స్టార్ కి తెలుగులో వర్కౌట్ అవుతుందా.. ?

Published on Jun 9, 2019 10:40 pm IST

మొత్తానికి ఉపేంద్ర చాలా సంవత్సరాల తరువాత తానూ హీరోగా నటించిన సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నాడు. గతంలో ‘ఓం’, ‘ఏ’, ‘సూపర్’ వంటి చిత్రాలు ఉపేంద్రకి తెలుగులో మంచి పేరే తీసుకొచ్చాయి. పైగా కన్నడంలో తన సినిమాలతో సంచలనం సృష్టించే ఈ కన్నడ సూపర్ స్టార్ సినిమా తెలుగులో విడుదలవుతుందటే తెలుగు ప్రేక్షకుల్లో కూడా బాగానే ఆసక్తి ఉంటుంది.

కాగా తాజాగా ఉపేంద్ర హీరోగా నటించిన సినిమా ‘ఐ లవ్ యు’. ‘నన్నే… ప్రేమించు’ అనేది క్యాప్షన్‌. రచితా రామ్‌ హీరోయిన్‌. తెలుగు పరిశ్రమకు ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’తో దర్శకుడిగా పరిచయం అయిన ‘ఆర్‌. చంద్రు’, శ్రీ సిద్ధేశ్వరా ఎంటర్‌ప్రైజెస్‌ పతాకం పై స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 14న సినిమాను విడుదల చేస్తున్నారు.

మరి చాలా విరామం తరవాత తెలుగులో తన సినిమాను విడుదల చేస్తున్న ఉపేంద్రకి ఎలాంటి విజయం దక్కుతుందో.. అసలు ఎంత వర్కౌట్ అవుతుందో.. చూడాలి.

సంబంధిత సమాచారం :

More