ఇంటర్వ్యూ : రత్నవేలు – నా హార్ట్ అండ్ సోల్ పెట్టి ‘రంగస్థలం’ చేశాను !

ఇంటర్వ్యూ : రత్నవేలు – నా హార్ట్ అండ్ సోల్ పెట్టి ‘రంగస్థలం’ చేశాను !

Published on Apr 10, 2018 5:36 PM IST

రామ్ చరణ్, సుకుమార్ ల ‘రంగస్థలం’ అంతటి విజయం సాధించడానికి దోహదపడిన అంశాల్లో 80 ల కాలన్ని తలపించే విజులవ్స్ కూడ ఉన్నాయి. ఆ విజువల్స్ కు కారణం సినిమాటోగ్రఫర్ ఆర్.రత్నవేలు. ఆయన తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆ విశేషాలు..

ప్ర) ఇంత గొప్ప ఔట్ ఫుట్ కు ప్రధాన కారణం ?
జ) సినిమాటోగ్రాఫర్ అంటే జస్ట్ కెమెరామ్యాన్ కాదు. అతనికి , దర్శకుడికి మధ్యన మంచి రిలేషన్ ఉంటేనే ఇలాంటి ఔట్ ఫుట్ సాధ్యం. మా మొదటి సినిమా ‘ఆర్య’ నుండి నాకు, సుకుమార్ కు అలాంటి రిలేషన్ ఉంది.

ప్ర) సినిమాను ఈ తరహాలోనే తీయాలని ఎలా అనుకున్నారు ?
జ) నేను సినిమాకి ముందే పూర్తి స్క్రిప్ట్ వింటాను. ఈ సినిమాకి కూడ పలుసార్లు సుకుమార్, నేను స్క్రిప్ట్ గురించి చర్చించుకున్నాం. ఆయన రాసింది విలేజ్ డ్రామా. కాబట్టి ప్రేక్షకుల్ని 80ల కాలంలోకి తీసుకెళ్ళాలి. సినిమా రస్టిక్ గా, అందంగా ఉండాలి. తెలుగు కల్చర్ ఉట్టిపడేలా ఉండాలి. అందుకే ఇలా తీశాను.

ప్ర) ఈ ఔట్ ఫుట్ కోసం ఎలాంటి హోమ్ వర్క్ చేశారు ?
జ) అంటే ఈ సినిమాలో నటీనటుల పెర్ఫార్మెన్స్ ని కాప్చర్ చేయడానికి ట్రై చేశాం. అందుకే ఎక్కువ వైడ్ షాట్స్ ఉంటాయి. ప్రతి సీన్ కి ముందు ఆర్ట్ టీమ్, కాస్ట్యూమర్ తో కూర్చుకుని సన్నివేశంలో ఏం ఉండాలి, ఏం ఉండకూడదు అనేవి ముందే డిసైడ్ చేసే వాళ్ళం. అందరూ క్రమశిక్షణతో వర్క్ చేయడం వలనే ఈ సక్సెస్ సాధ్యమైంది.

ప్ర) ఈ సినిమాకు మీకెలాంటి ఫీడ్ బ్యాక్ అందింది ?
జ) సాధారణంగా సినిమాటోగ్రఫర్ కు అంతగా పేరు రాదు. కానీ ఈ సినిమాలో మాత్రం నా గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. విడుదలైన మొదటి రోజు కూడ ఎంతో మంది నాకు ఫోన్ చేసి మెచ్చుకున్నారు. క్రిటిక్స్, ప్రేక్షకులు కూడ ప్రత్యేకంగా అభినందించారు.

ప్ర) ఒక సినిమా మీదే ఎక్కువ సమయం కేటాయిస్తారు ఎందుకని ?
జ) నాకు సినిమా అంటే చాలా ఇష్టం. అందుకే ఎక్కువ టైం తీసుకుని తక్కువ సినిమాలు చేస్తాను. ‘రోబో’ హిట్ తర్వాత కూడ చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ ఏదీ చేయలేదు. సుకుమార్, మహేష్ ప్రాజెక్ట్ చేశాను. చిన్న సినిమా ‘కుమారి 21 ఎఫ్’ కు కూడ నా పూర్తి స్థాయి సహకారం అందించాను.

ప్ర) ఇదే మీ బెస్ట్ వర్క్ అనుకోవచ్చా ?
జ) అవును. ఈ సినిమాని హార్ట్ అండ్ సోల్ పెట్టి చేశాను. నా బిగ్గెస్ట్ హిట్, పేరు వచ్చిన సినిమా ‘సేతు’. దాని తర్వాత అంతటి సినిమా ఈ ‘రంగస్థలం’. ఇలాంటి సినిమాలు ఎప్పుడో కాని రావు.

ప్ర) సుకుమార్ తో ఇన్నేళ్ల మీ జర్నీ ఎలా ఉంది ?
జ) సుకుమార్ తో నాది 14 ఏళ్ల జర్నీ. సుకుమార్ అన్ని అంశాల్ని పట్టించుకుంటాడు కానీ కెమెరా విషయంలో ఏం మాట్లాడడు. అతనికేం కావాలో అదే ఇస్తాననే నమ్మకముంది నా మీద.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు