ఇంటర్వ్యూ : బన్నీ వాసు – ఆ 10 రోజులు నరకం చూశాను !

ఇంటర్వ్యూ : బన్నీ వాసు – ఆ 10 రోజులు నరకం చూశాను !

Published on Aug 18, 2018 4:37 PM IST

గీత గోవిందం ఇటీవల విడుదలై విజయవంతగా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో చిత్ర నిర్మాత బన్నీ వాసు మీడియా తో మాట్లాడారు ఇప్పుడు ఆ విశేషాలు మీ కోసం ..

సినిమా ఈ స్థాయిలో విజయం సాధిస్తుందని అనుకున్నారా ?
సినిమా తీసేటప్పుడు కామెడీ ఎంటర్టైనర్ గా బాగా తీస్తున్నాం హీరో కూడా రైజింగ్లో ఉండడంతో మంచి కలెక్షన్స్ వస్తాయని అనుకున్నాం. కానీ ఈ రేంజ్ లో ఓపెనింగ్స్ ను ఊహించలేదు.

ఈ సినిమాకు ఏమైనా సలహాలు ఇచ్చారా ?
పరుశురాం విజయ్ కు కథ చెప్పినప్పుడు విజయ్ కు నచ్చింది. కానీ విజయ్ డిఫరెంట్ గా చేద్దాం అనుకుంటున్నాను. ఇలా ఎంటర్టైనర్ గా ఒకే అవుతుందా అని అడిగినప్పుడు ఈ సినిమా బి సెంటర్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. నీ కెరీర్ కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ సారి మమల్ని నమ్మి చేయి అని సలహా ఇచ్చాను ఆయన దాన్ని నమ్మి ఈసినిమా చేశాడు.

పరుశురాం లో మీకు ఏం నచ్చింది ?
ఆయన జెన్యూనిటీ. అనవసరమైన విషయాల్లో అస్సలు తల దూర్చడు. ఆయనకు, నాకు మధ్య అన్నదమ్ముల రిలేషన్ ఉంటుంది.

సినిమాకు వచ్చిన గొప్ప ప్రశంస ?
నా సినిమాలు చూసి స్టార్ హీరోలు ట్వీట్ చేస్తే బాగుండు అని అనుకుంటాను. ముందు అల్లు అర్జున్ ఎడిటింగ్ రూమ్ లో ఈ సినిమా చూసి కౌగలించుకున్నాడు. ఆ తరువాత నిన్న మహేష్, రామ్ చరణ్ సినిమా గురించి ట్వీట్స్ చేయడం ఎప్పటికి మర్చిపోలేను.

సినిమా లీకేజీ గురించి ?
ఇన్ని కోట్లు పెట్టి తిసినా వేరే వాళ్ల లాప్ టాప్ లో వుంది అని తెలిసి చాలా బాధ పడ్డ . పగవాడికి కూడా ఈ కష్టం రావొద్దు అని అనిపించింది. ఆ10రోజులు నరకం కనబడింది.

బయట సినిమా మీద హైప్ రావడానికి మీరు లీక్ చేశారని అంటున్నారు దాని గురించి ?

ఎవడైనా ఫుల్ సినిమాను లీక్ చేస్తారా. ఒకటి రెండో సీన్లు లీకయ్యాయి అంటే అనుకోవచ్చు. మళ్లీ హై రేంజ్లో వున్నా పోలీస్ ఆఫీసర్ ఈ కేసు ను హ్యాండిల్ చేశారు నిజంగా అ పని మేము చేస్తే ఉంటామా అదంతా అబద్దం.

ఈ లీకేజీ జరగడం వల్ల లాభం జరిగిందా ?
లేదు చాలా నష్టం. కొన్ని కాలేజ్, స్కూల్స్ లో ఆడిటోరియమ్లో ఈచిత్రాన్ని ప్రదర్శించారు. చాలా దారుణమిది. దానివల్లకలెక్షన్స్ తగ్గిపోతాయి.

కలెక్షన్స్ గురించి చెప్పండి ?
ఈ తరహా కలెక్షన్స్ అస్సలు ఊహించలేదు. డ్రిస్టిబ్యూటర్స్ అంత రెండో రోజుకే బ్రేక్ ఈవెన్ కు చేరుకున్నారు. బహుశా ఇండస్ట్రీ లో ఎలాగా ఎప్పుడు జరుగలేదు. చాలా సంతోషం గా ఉంది.

కేరళ కలెక్షన్స్ గురించి ?
కేరళ లో బన్నీ సినిమాలు విడుదలవుతాయి కాబట్టి అక్కడ నాకు మంచి పట్టు వుంది. దాంతో ఈ చిత్రాన్ని అక్కడ విడుదల చేశాం మొదటి రోజు 14లక్షల గ్రాస్ ను రెండవ రోజు 6లక్షల రూపాయల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. నాకు షాక్ అనిపించింది. అంత వరదల్లో కూడా నా సినిమాను చూస్తున్నారని అందుకే అక్కడ కలెక్ట్ చేసిన షేరును మొత్తం విరాళం గా ఇచ్చాను.

బన్నీ నెక్స్ట్ సినిమా గురించి ?
నాకు తెలిసి బన్నీ సినిమాల విషయంలో రెండు పెద్ద అనౌన్స్ మెంట్స్ రానున్నాయి . కథ లాక్ అయ్యే వరకు బన్నీ ఎవరికి చెప్పడు. ఆయన సినిమా అంగీకరిస్తే ఆ విషయాన్నీ నేనే స్వయంగా ప్రకటిస్తా.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు