
ఎప్పటికప్పుడు సరికొత్త కాన్సెప్ట్స్, సరికొత్త టెక్నాలజీతో సూపర్ హిట్ సినిమాలను అందించే శంకర్ దర్శకత్వంలో రానున్న సినిమా ‘ఐ’. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్ర టీం నిన్న ముంబై వెళ్లి అక్కడ ఐ హిందీ ట్రైలర్ ని లాంచ్ చేసారు. అక్కడ ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ అయిన పిసి శ్రీరాం ఇండియాలో 35 ఎంఎం సెల్యులాయిడ్ లో షూట్ చేసిన చివరి బిగ్ బడ్జెట్ మూవీ ఇదేనని అన్నాడు. ఇక నుంచి ఫిల్మ్ లో షూట్ చేసిన ఫీల్ ని సినిమాటోగ్రాఫర్స్, మూవీ లవర్స్ మిస్ అవుతారు.
అలాగే మాట్లాడుతూ తెదిశానల్ ఫిలిం మెథడ్ లో వచ్చిన డిజిటల్ మార్పులకి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దానివల్ల ఖర్చు తగ్గుతుంది వర్క్ కూడా స్మూత్ గా ఉంటుంది. ప్రస్తుతం ఇండియాలోని చాలా సినేమాలి డిజిటల్ లోనే షూట్ చేస్తున్నారు. అందుకోసం వాళ్ళు రెడ్ కామ్, అర్రి అలెక్సా, కేనన్ 5డి డిఎస్ ఎల్ఆర్ లాంటి కెమెరాలను వాడుతున్నారని అన్నాడు. ఈ వేడుకలో ఐ సినిమాలో విజువల్స్ అన్నీ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటాయని టీం తెలిపారు.