కరోనా టెస్ట్ కి తెగ భయపడిపోయిన పాయల్ !

Published on Sep 26, 2020 3:43 pm IST

‘ఆర్ ఎక్స్ 100’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హాట్ బ్యూటీ ‘పాయల్ రాజ్ పుత్’ తాజాగా నటిస్తోన్న సినిమా షూటింగ్ లో పాల్గొంది. అయితే షూటింగ్ స్పాట్ లో పాయల్ కి చేసిన కరోనా టెస్ట్ కి తెగ భయపడిపోయింది. ఈ సందర్భంగా పాయల్ కి కరోనా టెస్ట్ చేసిన వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘అన్ని ముందు జాగ్రత్త చర్యలతో నా షూటింగ్ ప్రారంభైంది. అయితే కరోనా టెస్ట్ కోసం నా ముక్కు లోపల 5 సెకన్ల పాటు ఒక పరికరకంతో శుభ్రముపరిచిన విధానం మాత్రం భయంకరమైన అసౌకర్యంగా అనిపించింది. కానీ, నేను ఆ టెస్ట్ చేసినందుకు సంతోషంగా ఉంది. నాకు కరోనా నెగిటివ్ వచ్చింది. ఏది ఏమైనా ఇది పూర్తి కావడానికి నేను నిజంగా భయపడ్డాను అంటూ వీడియో పోస్ట్ చేసింది.

ఇక ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలన విజయం సాధించినా పాయల్, ఆ తరువాత ఆ స్థాయిలో విజయాలను గానీ, అవకాశాలు గానీ ఈ భామకు దక్కలేదు. మరి రాబోయే రోజుల్లోనైనా పాయల్ రాజ్ ఫుత్ కి అవకాశాలు పెరుగుతాయేమో చూడాలి. ఇక పాయల్ ఓ హిందీ వెబ్ సిరీస్ లో నటించనుంది. ఈ వెబ్‌ సిరీస్‌ ను రామ సుబ్రమణ్యన్ డైరెక్ట్ చేయనుండగా, అనంద్ వికటన్ సంస్థ నిర్మిస్తోంది. అయితే సౌత్ ఇండియాలో, తెలుగులో వచ్చిన సిరీస్‌ లు అంతగా ఆదరణకు నోచుకోలేదు. మరి పాయల్ కైనా వెబ్ సిరీస్ తో హిట్ అందుకుంటాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More