
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి టాలీవుడ్ లో సూపర్బ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రామ్ చరణ్ కి కెరీర్ ప్రారంభంలోనే హిందీ నుంచి కూడా ఓ ఆఫర్ రావడంతో తను ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ‘జంజీర్’. కానీ ఈ సినిమా వారు అనుకున్న దానికి విరుద్దంగా బాక్స్ ఆఫీసు వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. దాంతో బాలీవుడ్ కి గ్యాప్ ఇచ్చిన రామ్ చరణ్ తెలుగులోనే వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో రామ్ చరణ్ అశుతోష్ గోవారీకర్ ‘మొహెంజో దారో’ సినిమాతో మళ్ళీ బాలీవుడ్ లో సినిమా చేయనున్నాడనే వార్తలు వచ్చాయి.
రీసెంట్ గా ఆయన ఓ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తదుపరి బాలీవుడ్ ప్రాజెక్ట్స్ పై క్లారిటీ ఇచ్చాడు. ‘అశుతోష్ గోవారీకర్ ‘మొహెంజో దారో’ కోసం అప్రోచ్ అయ్యాడు, అన్నీ అనుకున్నట్లు జరగకపోవడంతో నేను తప్పుకున్నాను, ఆ తర్వాత హృతి రోషన్ ఎంటర్ అయ్యాడు. ప్రస్తుతం కుదిరినప్పుడు బాలీవుడ్ కోసం కథలు వింటున్నాను. త్వరలోనే ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా ఉంటుందని’ రామ్ చరణ్ తెలిపాడు. దీని ప్రకారం 2016లో రామ్ చరణ్ మరో బాలీవుడ్ సినిమా చేసే అవకాశం కనిపిస్తోంది.
రామ్ చరణ్ ప్రస్తుతం శ్రీను వైట్ల డైరెక్షన్ లో చేస్తున్న 9వ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. అక్టోబర్ 16న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.