ఇంటర్వ్యూ : సుప్రియ- నెగిటివ్ రోల్స్ చేయడమంటే చాలా ఇష్టం !

ఇంటర్వ్యూ : సుప్రియ- నెగిటివ్ రోల్స్ చేయడమంటే చాలా ఇష్టం !

Published on Aug 4, 2018 5:34 PM IST

22 సంవత్సరాల తరువాత సుప్రియ యార్లగడ్డ ‘గూఢచారి’ సినిమా తో రీఎంట్రీ ఇచ్చింది. నిన్న విడుదలైన ఈచిత్రానికి మంచి రెస్పాన్ వస్తుంది. ఈ సంధర్బంగా సుప్రియ మీడియా తో మాట్లాడారు . ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం..

ఈ పాత్రను మీకు ఆఫర్ చేసినప్పుడు ఏ విధంగా స్పందిచారు ?

పరిశ్రమ నుండి చాలా మంది వారి స్క్రిప్టులను వినిపించి వాటి గురించి నా అభిప్రాయాన్ని అడుగుతారు. శశి మరియు అడివి శేష్ నా దగ్గరికి వచ్చినప్పుడు అదే అనుభూతి కలిగింది. స్క్రిప్ట్ ను వివరించిన తరువాత, శేష్ నదియా ఖురేషీ పాత్రలో నన్ను నటించమని అడిగాడు. నేను మొదట వారిని ఆడిషన్ చేయమని చెప్పాను. ఆ ఆడిషన్ తో చాలాకాలం తర్వాత నేను మళ్లీ కెమెరాను పేస్ చేశాను.

చాలా కాలం తర్వాత మీరు మళ్లీ కెమెరాను ఎదుర్కొన్నారు ఎలా అనిపించింది ?

అప్పటికి ,ఇప్పటికి పరిస్థితులు చాలా మారాయి. కెమెరా ముందు ఉండటం ఇష్టం లేదని నా తాత నాకు చెప్పిన రోజు నాకు ఇంకా గుర్తుంది. కానీ ఏదో ఒకవిధంగా నేను చేస్తాను . , చాలా మంది నన్ను జడ్జ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా టీం వల్ల చాలా కంఫర్ట్ గా కెమెరాను ఎదుర్కొన్నాను. కాకపోతే మొదటి రోజు అడ్జస్ట్ అవ్వడానికి కొంచం టైం పట్టింది.

ఈ చిత్రంలో ఏ ఏ అంశాలు మిమ్మల్ని ఆకట్టుకున్నాయి ?

మొదటగా తెలుగులో ఇలాంటి కొత్త రకమైన సినిమాని ప్రయత్నిచడం నచ్చింది. అంతే కాకూండా ఈచిత్రంలో తండ్రి మరియు కుమారుడు సంబంధం గురించి అద్భుతంగా చూపెట్టారు అది నాకు చాలా ఇష్టం.

మీరు మరిన్ని సినిమా లు చేయడానికి సిద్ధంగా ఉన్నారా ?

అవును! నేను చేస్తా. కాని భలమైన పాత్రలు వస్తే నే నేను నా నటనను కొసాగిస్తాను. ఆడియోను నిర్వహించడం అలాగే ప్రొడక్షన్ హౌస్ ను ముందుకు తీసుకెళ్లడం నాకు పెద్ద బాధ్యత. ప్రారంభంలో, నేను ఒక రచయిత కావాలని, కొన్ని స్క్రిప్ట్స్ వ్రాశాను. తరువాత నటిని అయ్యాను, ఇప్పుడు నేను అన్నపూర్ణ నిర్వహణను చూసుకుంటున్నాను. మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీకు ఎప్పటికీ తెలియదు.

ఈ చిత్రం కోసం మీకు దక్కిన బెస్ట్ కాంప్లిమెంట్ ?

ఏఎన్ఆర్ అభిమానులు నన్ను పిలిచి నా నటన ను చూసి అభినందించారు. నా తాత ప్రజల్లో ఒక బలమైన ముద్ర వేశారు. ఆయన మనుమరాలు బాగా చేసిందని ప్రేక్షకులు పొగుడ్తూ ఉంటే సంతోషం వేసింది.

మీరు ఎప్పుడైనా ప్రతినాయకురాలి పాత్ర చేస్తారా?

ఎందుకు చేయను . కానీ పాత్రలు నటులను గుర్తుపెట్టుకొని రాయాలి అప్పుడే ముందుకు వెళ్ల గళం. తెలుగు సినిమా ఇప్పుడే ఈ కంచెలను దాటుతుంది. నేను ఛాలెంజిగ్ పాత్రలు చేయడానికి ఇష్టపడుతాను అప్పుడే నా సత్తా ఏంటో నాకు తెలుస్తుంది.

నటన కాకుండా ఇంకా ఏం చేయడానికి ఇష్ట పడుతారు ?

నా సమయాన్ని అంతా అన్నపూర్ణ స్టూడియోస్ కేటాయిస్తాను. నేను ఈ స్టూడియో కి కాపలాగా ఉంటాను.ఇక్కడ ఉండి చాలా కార్యాక్రమాలను నిర్వహించాను. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది. నేను స్టూడియో కి ఏం చేసిన ఇష్టపడే చేస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు