భారీ హైప్స్ క్రియేట్ చేస్తున్న పుష్ప…ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్..!

Published on Aug 2, 2021 12:47 pm IST


అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా పుష్ప చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కి సంబంధించిన పోస్టర్ నుండి వీడియో వరకూ సోషల్ మీడియా ను షేక్ చేయడం జరిగింది. అల్లు అర్జున్ హీరో గా నటిస్తున్న ఈ చిత్రం లో ఊర మాస్ పాత్ర లో మునుపెన్నడూ చూడని విధంగా నటిస్తున్నారు.

అయితే ఈ చిత్రం కి సంబంధించిన అప్డేట్ తాజాగా చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను ఆగస్ట్ 13 వ తేదీన ఐదు బాషల్లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు. అయితే హిందీ లో విశాల్ దడ్లాని, కన్నడ లో విజయ్ ప్రకాశ్, మలయాళం లో రాహుల్ నంబియార్, తెలుగు లో శివం, తమిళ్ లో బెన్ని దయాల్ లు పాట ను పాడుతున్నారు.

అయితే దాక్కో దాక్కో మేక, పులోచ్చి కొడుతుంది పీక అంటూ వచ్చే లిరిక్స్ సినిమా లో బన్నీ క్యారెక్టర్ పై ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఐకాన్ స్టార్ గా బన్నీ తొలి పాన్ ఇండియా చిత్రం కావడం తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం ఈ అప్డేట్ తో పాన్ ఇండియా స్థాయి లో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది అని చెప్పాలి. అయితే ఈ పాట ఆగస్ట్ 13 వ తేదీన విడుదల అవుతుండటం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే సుకుమార్, అల్లు అర్జున్, దేవీ శ్రీ ప్రసాద్ కాంబో లో వస్తున్న మూడవ చిత్రం కావడం తో సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అంటూ పలువురు సినీ క్రిటిక్స్ చెబుతున్నారు. ఈ చిత్రం లో బన్నీ సరసన హీరోయిన్ గా రశ్మీక మండన్న నటిస్తోంది.

వీడియో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :