బాలీవుడ్ లో ఐకాన్ స్టార్ హవా..”పుష్ప” ఫైనల్ లెక్కపై మంచి అంచనాలు!

Published on Dec 23, 2021 4:34 pm IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “పుష్ప ది రైజ్” పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ అయ్యి అన్ని అంచనాలు అందుకొని సాలిడ్ కలెక్షన్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అంతా ఐకాన్ స్టార్ బాలీవుడ్ ఎంట్రీ కోసం ఆసక్తిగా చూసారు. అసలు అల్లు అర్జు ఫస్ట్ హిందీ డైరెక్ట్ రిలీజ్ ఇది దీనితో అనేక అనుమానాలు ఉన్నాయి.

సరైన ప్రమోషన్స్ అక్కడ పరిస్థితులు సహకరించలేదు కానీ అవన్నీ కరెక్ట్ గా సెట్టయ్యి ఉంటే పుష్ప తో ఐకాన్ స్టార్ ఖచ్చితంగా మంచి మ్యాజిక్ చేసేవాడు. ఇప్పటికీ చెయ్యలేదని కాదు కానీ ఇప్పటికీ సాలిడ్ వసూళ్లు కొల్లగొడుతూ బన్నీ బాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాడు. మొదటి రెండు రోజులు కన్నా వీక్ స్టార్ట్ రోజుల్లో వసూళ్లు అందుకోవడం ఏదైతే ఉందో అది చూసి ప్రతి ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికీ డీసెంట్ హోల్డ్ తో ముఖ్యంగా నైట్ షోస్ హౌస్ ఫుల్స్ తో ఇంకా రన్ అవుతున్నాయి. దీనితో పుష్ప డెఫినెట్ గా బాలీవుడ్ మార్కెట్ వద్ద 30 కోట్లకు పైగా షేర్ ని అందుకోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్ గా మాత్రం ఐకాన్ స్టార్ కి పాన్ ఇండియన్ లెవెల్లో మంచి వెల్కమ్ దక్కింది అని చెప్పాలి. ఇక పార్ట్ 2 తో అది మరింత బలపడడం కూడా ఖాయం.

సంబంధిత సమాచారం :