నాగ్ – నానిల మల్టీ స్టారర్ చిత్రానికి ‘దేవదాసు’ టైటిల్ ?

Published on Jul 2, 2018 11:16 pm IST


1953లో లెజెండరీ యాక్టర్ ‘ఏఎన్ఆర్’ గారు నటించిన చిత్రం ‘దేవదాసు’. ఈచిత్రం తెలుగు సినిమాల్లో క్లాసిక్ చిత్రంగా నిలిచిపోయింది. ఇప్పుడు ఈ చిత్ర టైటిల్ ను ఆయన కుమారుడు ‘కింగ్’ నాగార్జున నటిస్తున్న చిత్రానికి వాడుకుంటున్నట్లు సమాచారం. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగ్ , నానీలు కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రానికి ఈ టైటిల్ నే ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ వార్తపై ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. 60 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ పతాకం ఫై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :