యూత్ ని కట్టిపడేస్తున్న “ఇద్దరి లోకం ఒకటే” సాంగ్స్

Published on Nov 30, 2019 5:51 pm IST

రాజ్ తరుణ్,శాలిని పాండే హీరో,హీరోయిన్స్ గా, జీ.ఆర్.కృష్ణ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. నిర్మాణాంతర కార్యకమాలు జరుపుకుంటున్న ఈమూవీ డిసెంబర్ లో విడుదల కానుంది .ఒక విభిన్న ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతుందని సమాచారం.కాగా మిక్కి జే మేయర్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాటలు యూత్ లో మంచి ఆదరణ దక్కించుకుంటూ సూపర్ హిట్ గా నిలిచాయి.

ఇక టాప్ టెన్ లిస్టులో సామజవరగమనా తర్వాత రెండవ స్థానం లో నిలవడం విశేషం. మ్యూజిక్ హిట్ అయ్యిందంటే సగం సినిమా హిట్ అయ్యినట్టే ..మంచి మేలోడియస్ గా యూత్ కి నచ్చేలా పాటలు ఉన్నాయని సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు నెటిజెన్స్. ఈ నేపథ్యంలో ఇద్దరి లోకం ఒకటే మూవీ పై అంచనాలు రోజు రోజు కి పెరుగుతున్నాయి.దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ సొంతంగా సినిమా రిలీజ్ చేస్తున్నాడంటేనే అర్థం చేసుకోవచ్చు ఆయనకు సినిమా మీద ఎంత నమ్మకం ఉందో అని .ఈసారి రాజ్ తరుణ్ ఖచ్చితంగా హిట్ కొడతాడనిపిస్తుంది. విడుదల కి ముందే శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోవడం మరో విశేషం.

సంబంధిత సమాచారం :