మహేషే అనుకుంటే, త్రివిక్రమ్ కూడానా…!

Published on Jun 13, 2019 4:00 am IST

సినిమా ఇండస్ట్రీ ని నమ్ముకున్నవారు తమ పెట్టుబడులను సినిమాకు సంబందించిన వ్యాపారాలలోనే పెట్టుబడిపెడుతుంటారు. సినిమా నిర్మాణం, అలాగే థియేటర్ల నిర్వహణ , డిస్ట్రిబ్యూషన్ ఇలా తమ సంపాదనను పెట్టుబడిగా పెడుతుంటారు. మహేష్ కి ఓ సొంత నిర్మాణ సంస్థతో పాటు, ‘ఏ ఎం బి’ పేరుతొ మల్టీ ఫ్లెక్స్ బిజినెస్ చేస్తున్నారు. త్రివిక్రమ్ కి కూడా హారిక అండ్ హాసిని ప్రొడక్షన్ లో భాగం ఉంది. తాజాగా అయన తూర్పు గోదావరి జిల్లాలో ఓ ధియేటర్ కొన్నారట. దానిని ఆధునీకరించి ఒకరికి నిర్వహణ బాధ్యతలు అప్పగించారట.
ప్రస్తుతం బన్నీ, పూజా హెగ్డే ప్రధాన తారాగణంగా ఆయన తీస్తున్న మూవీ కూడా గీతా ఆర్ట్స్ భాగస్వామిగా హారిక అండ్ హాసిని నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తోంది. ఈ విధంగా త్రివిక్రమ్ మహేష్ వలే మూవీ నిర్మాణం తో పాటు, థియేటర్ల నిర్వహణ లోకి దిగారు.

సంబంధిత సమాచారం :

More