ప్రభాస్ వేరే సినిమా అయితే అక్కడ మరోలా ఉండేదేమో..!

Published on Feb 25, 2021 6:00 pm IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించిన “రాధే శ్యామ్” చిత్రం విడుదలకు రెడీ అయ్యిపోయిన సంగతి తెలిసిందే. మరి అలాగే ఈ చిత్రం విడుదల కానున్న సమయంలోనే కొన్ని రోజుల గ్యాప్ లోనే మరిన్ని భారీ పాన్ ఇండియన్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఒక్కోదానికి గ్యాప్ బాగానే ఉంది కాబట్టి వసూళ్లకు ఎలాంటి ఢోకా ఉండదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

కానీ లేటెస్ట్ గా బాలీవుడ్ మరో బిగ్ చిత్రం “గంగూభాయ్ ఖతియవాది” చిత్రం రాధే శ్యామ్ లాక్ చేసిన డేట్ జూలై 30 కే ఫిక్స్ కావడంతో నయా రచ్చ స్టార్ట్ అయ్యింది. అయితే ఈ సినిమాకు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అలాగే అక్కడి స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పైగా భన్సాలీ సినిమా అంటే అక్కడ మినిమమ్ గ్యారంటీ అనే ముద్ర ఉంది. మరి వీటన్నిటినీ నెట్టుకొచ్చేది మాత్రం ఒక్క ప్రభాస్ అనే బ్రాండ్ అనే చెప్పాలి. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ప్రభాస్ పేరు ఒక బ్రాండ్.

కాకపోతే ఇప్పుడు చేస్తున్న “రాధే శ్యామ్” అవుట్ అండ్ అవుట్ ఫుల్ క్లాస్ చిత్రం. అదే కానీ ఒక మాస్ యాక్షన్ థ్రిల్లర్ అయ్యి కనుక ఉంటే ఈ పోటీ డెఫినెట్ గా ప్రభాస్ వల్ల మరోలా ఉండేది. అది లాస్ట్ టైం టైమే “సాహో”తో ప్రూవ్ అయ్యింది. మరి ఇప్పుడు రాధే శ్యామ్ కంటెంట్ కూడా స్ట్రాంగ్ గా ఉంటే అక్కడ మంచి పోటీ ఇస్తుంది. దీనితో ఇప్పుడు అంతా ప్రభాస్ బ్రాండ్ కన్నా కంటెంట్ మీదనే ఆధాపడి వచ్చింది. మరి యూవీ మేకర్స్ ఈ బిగ్గెస్ట్ క్లాష్ విషయంలో ఏం చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :