మహేష్,పవన్ నుంచి ఇది జరిగుంటేనా..సీన్ దద్దరిల్లేది.!

మహేష్,పవన్ నుంచి ఇది జరిగుంటేనా..సీన్ దద్దరిల్లేది.!

Published on Dec 19, 2020 8:00 AM IST

mahesh pawan

మన టాలీవుడ్ లో ఎన్ని సెన్సేషనల్ కాంబోలు ఉన్నా సరే ఎవ్వరికైనా హై ఎండ్ ఎంఆర్గ్య్ ఇచ్చే కాంబో ఏదన్నా ఉంది అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబుల కాంబో అని చెప్పాలి. ఈ కాంబినేషన్ కు ఉన్న హై నే వేరే లెవెల్లో ఉంటుంది. ఆ మధ్య పవన్ కు మహేష్ బర్త్ డే విషెష్ చెప్పడం దానికి పవన్ కూడా రిప్లై ఇవ్వడంతో వీరి అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి. దీనితో మళ్ళీ ఇద్దరు కలిసే ఫ్రేమ్ ఒకటైన దొరుకుంటుందా అని చాలా మంది ఎదురు చూసారు.

కానీ నిన్న మన టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు 50వ పుట్టినరోజు సందర్భంగా మొత్తం టాలీవుడ్ అంతా కదిలింది. అగ్ర హీరోలు అంతా ఆ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. అలా పవన్ మరియు మహేష్ లు కూడా అటెండ్ కాగా ఖచ్చితంగా ఈ ఇద్దరు కలిసి ఉండే పిక్ ఒకటైన రాకుండా ఉంటుందా అని అంతా ఎదురు చూసారు. కానీ ఫైనల్ గా మాత్రం అది జరగలేదు వారికి నిరాశ తప్పలేదు.

కానీ పవన్ తప్ప మిగతా అగ్ర హీరోలు అంతా కలిసి ఉన్న ఫోటో ఒకటి రాగా అది వైరల్ అయ్యింది. మరి అందులోనో లేక మహేష్ తో కలిసి పవన్ ఉన్న ఫోటో ఒక్కటి కానీ వచ్చి ఉంటేనా సోషల్ మీడియాను ఇద్దరు హీరోల అభిమానులు మరోసారి దద్దర్లిల్లించేద్దాం అనుకున్నారు. కానీ అందుకు ఛాన్స్ రాలేదు. ఫైనల్ గా ఆ మ్యాజికల్ మూమెంట్ ను మిస్సవ్వడంతో ఇద్దరు హీరోల అభిమానులు రియలిస్టిక్ ఎడిటింగ్ ఫొటోస్ టైం లైన్ లో సరిపెట్టుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు