ఐఫా ఉత్సవమ్ 2016 – టాలీవుడ్ విన్నర్స్ లిస్టు

ఐఫా ఉత్సవమ్ 2016 – టాలీవుడ్ విన్నర్స్ లిస్టు

Published on Jan 26, 2016 11:55 AM IST

iifa
నేషనల్ వైడ్ బాగా ఫేమస్ అయిన ఐఫా అవార్డ్స్ వారు మొదటి సారిగా సౌత్ లోని నాలుగు సినీ ఇండస్ట్రీస్ ని కలుపుతూ చేసిన ఐఫా ఉత్సవమ్ అవార్డ్స్ వేడుక 24, 25 తేదీలలో అంగరంగ వైభవంగా జరిగింది. నిన్న సాయంత్రం జరిగిన వేడుకలో 2015 తెలుగు సినిమాకి సంబందించిన అవార్డ్స్ ని అందజేశారు.. అందులో మెయిన్ అవార్డ్స్ ఎవరెవరికి వెళ్ళాయి అనే విశేషాలు మీకోసం..

ఉత్తమ నటుడు – మహేష్ బాబు (శ్రీమంతుడు)
ఉత్తమ నటి – శృతి హాసన్ (శ్రీమంతుడు)
ఉత్తమ దర్శకుడు – ఎస్ఎస్ రాజమౌళి (బాహుబలి)
ఉత్తమ చిత్రం – బాహుబలి (శోభుయార్లగడ్డ – ప్రసాద్ దేవినేని)
ఉత్తమ సంగీత దర్శకుడు – దేవీశ్రీ ప్రసాద్ (శ్రీమంతుడు)
ఉత్తమ సహాయ నటుడు – జగపతి బాబు(శ్రీమంతుడు)
ఉత్తమ సహాయ నటి – రమ్యకృష్ణ (బాహుబలి)
ఉత్తమ గీత రచయిత – రామజోగయ్య శాస్త్రి (శ్రీమంతుడు)
ఉత్తమ మేల్ ప్లే బ్యాక్ సింగర్ – సాగర్ (శ్రీమంతుడు)
ఉత్తమ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ – సత్య యామిని (బాహుబలి)

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు