భారీ పారితోషికం అందుకోనున్న ఇలియానా !
Published on May 23, 2018 11:09 pm IST


రామ్ నటించిన ‘దేవదాస్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచియమైన హీరోయిన్ ఇలియానా దాదాపుగా తెలుగులో పెద్ద హీరోల అందరితో నటించింది. గత కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీ కి దూరమై హిందీ సినిమాల్లో నటిస్తుంది . ఈమె తాజాగా రవితేజ నటిస్తున్న అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా తో తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వనుంది . ఈ సినిమాకి గాను ఇలియానా 2కోట్ల భారీ మొత్తాన్ని డిమాండ్ చేసినట్టు దీనికి ఈ సినిమా నిర్మాతలు ఎలాంటి అయిష్టం లేకుండా ఆమె అడిగిన అంత ముట్ట జెప్పనున్నట్టు సమాచారం.

ఇలియానాకి రవితేజ తో ఇది 4వ సినిమా ఇంతకు ముందు ఖతర్నాక్ , కిక్ , దేవుడు చేసిన మనుషులు చిత్రాల్లో రవితేజ తో నటించింది.
అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో హీరోగా రవితేజ నటిస్తుండగా ఇలియానా ఓ కథానాయకి పాత్రలో మరొ కథానాయకి పాత్రలో శ్రుతి హాసన్ నటించనున్నారు. శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్నా ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook