‘అమర్ అక్బర్ ఆంటోనీ’ షూటింగ్లో పాల్గొంటున్న ఇలియానా !

‘అమర్ అక్బర్ ఆంటోనీ’ షూటింగ్లో పాల్గొంటున్న ఇలియానా !

Published on Jun 21, 2018 6:13 PM IST

శ్రీను వైట్ల దర్శకత్వం లో మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రం శరవేగంగా చిత్రకరణ జరుపుకుంటోంది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్లో ఇలియానా జాయిన్ అయ్యారు. చాలా రోజుల తరువాత ఆమె మళ్లీ తెలుగు సినిమాలో నటిస్తోంది. ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రంలో నటించిన తరువాత తెలుగు తెరకు దూరమైన ఇలియానా మళ్ళీ రవితేజ చిత్రంతోనే రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం గతంలో వీరిద్దరు కలసి మూడు సినిమాల్లో నటించారు .

ఇక మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారట. చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల వీలైనంత త్వరగా ఈ చిత్ర షూటింగ్ ను పూర్తి చేసి దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు