ప్రియుడితో బ్రేక్ అప్ తరువాత ఇలియానా ఫీలింగ్…?

Published on Nov 15, 2019 1:00 am IST

టాలీవుడ్ లో కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉండగానే ఇలియానా బాలీవుడ్ కి చెక్కేసింది. ఇక్క స్టార్ హీరోయిన్ హోదా అనుభవించిన ఆమె అక్కడ మాత్రం ఓ మోస్తరు వేషాలు దక్కించుకుంది. ఐతే బాలీవుడ్ లో ఆమె కెరీర్ అంతగా అభివృద్ధి అయితే చెందలేదు. కొన్నేళ్ల క్రితం ఇలియానా ప్రేమలో పడింది. ఆస్ట్రేలియాకు చెందిన ఫోటో గ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో కొన్నాళ్లు రిలేషన్షిప్ నడిపింది. వీరిద్దరూ ఓపెన్ గానే చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఇంకేముంది త్వరలో పెళ్లి అనుకున్న తరుణంలో ఇద్దరూ బ్రేక్ అప్ చెప్పి షాక్ ఇచ్చారు.

ఈ ఏడాది ఆగస్టులో ఇలియానా-ఆండ్రూ విడిపోయారు. ఐతే తాజాగా ఇలియానా ఈ విషయం పై స్పందించారు. ఆ విషయాలు నేను ఎప్పుడో మరచిపోయానని, ప్రస్తుతం నా ఫోకస్ అంతా వర్క్ మరియు కెరీర్ పైనే అని చెప్పారు. అలాగే నా ఆహార అలవాట్ల విషయంలో మార్పులు చేశానని, గతంతో పోల్చితే ఇప్పుడు హెల్తీ మరియు ఫిట్ గా ఉన్నాను, అని అన్నారు.

సంబంధిత సమాచారం :

X
More