పచ్చబొట్టు కావాలంటున్న ఇలియానా

పచ్చబొట్టు కావాలంటున్న ఇలియానా

Published on May 16, 2014 8:22 AM IST

illeyana
పచ్చబొట్టు చాలా పర్సనల్ విషయం. ఈ మధ్య కాలం లో పచ్చబొట్టు పొడిపించుకోవడం చాలా వర్గాల్లో ముఖ్యం గా యువతరం మరియు విద్యార్ధుల్లో ఫాషన్ అయిపోయింది. గతం లో అనేక మంది హీరోలు హీరోయిన్ లు పచ్చబొట్టు పొడిపించుకున్నారు.

ఈ జాబితా లో కొత్తగా చేరబోతున్ననటి ఇలియానా. ప్రస్తుతం పచ్చబొట్టు పోడిపించుకుందాం అనుకుంటున్న ఇలియానా తన స్నేహితులని సూచనలు అడుగుతుందని సమాచారం. ఎప్పటినుంచో ఈ ఆలోచనతో ఊగిసలాడుతున్న ఇలియానా మొత్తానికి ఒక నిర్ణయానికి వచ్చింది.

బాలీవుడ్ లో తనకంటూ ఒక స్థానాన్ని పొందడం కోసం ఇలియానా చాలా కష్టపడుతుంది. ఇటివలే ఒక హాట్ ఫోటో షూట్ లో మెరిసిన ఇలియానా నిర్మాతలను ఆక్కట్టుకోవడానికి మరిన్ని ప్రత్యేకమైన ఫోటో షూట్ లు చేయనుంది. దక్షిణాది లో కొన్ని పరాజయాలు చవి చూసిన తర్వాత ఇలియానా తన అదృష్టాన్ని బాలీవుడ్ లో పరీక్షించుకుంటుంది.

తాజా వార్తలు