పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్.. వరుడు అతనే ?

పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్.. వరుడు అతనే ?

Published on Sep 12, 2022 4:30 PM IST

సీనియర్ హీరోయిన్ ఇలియానా ప్రేమ పై ఇప్పటికే అనేక పుకార్లు వినిపించాయి. తాజాగా ఇలియానా పెళ్లి చేసుకోబోతుంది అంటూ మరో పుకారు వినిపిస్తోంది. ఇలియానా.. కత్రీనా కైఫ్‌ సోదరుడు ‘సెబాస్టియన్‌ లారెంట్‌ మిచెల్‌’తో లవ్‌ ట్రాక్‌ నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇలియానా – సెబాస్టియన్‌ లారెంట్‌ మిచెల్‌’ పెళ్లికి రెడీ అయ్యారట.

సడెన్ గా ఈ వార్త వైరల్ కావడానికి ఒక కారణం ఉంది. సెబాస్టియన్‌తో కలిసి ఇలియానా ప్రస్తుతం పెళ్లి షాపింగ్ చేస్తోందట. అందుకే, వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. కానీ, ఈ ప్రచారం పై ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరి ఇలియానా నిజంగానే పెళ్లి చేసుకుంటుందో లేదో చూడాలి.

నిజానికి గతంలో ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫ‌ర్ ఆండ్రూ నీబోస్‌తో ఇలియానా ప్రేమలో పడింది. చాలా కాలం అతనితో ప్రేమ కథను నడిపింది. కానీ ఆండ్రూ ఇలియానా లవ్ కి శుభం కార్డు పలికి వెళ్ళిపోయాడు. ఆండ్రూ దూరమైనప్పటికీ, ఇలియానా మాత్రం కొత్తగా మరో ప్రేమకథకు శ్రీకారం చుట్టి..
పెళ్లి వరకు తీసుకు పోయేలా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు