S/O సత్యమూర్తి సెన్సార్ ఎప్పుడంటే..!

S/O సత్యమూర్తి సెన్సార్ ఎప్పుడంటే..!

Published on Mar 30, 2015 12:49 PM IST

Son-of-satyamurty
‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో, ‘రేసుగుర్రం’ లాంటి సూపర్‌ హిట్‌తో జోరు మీదున్న అల్లు అర్జున్ నటించిన చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి. ప్రచార చిత్రాలు, ట్రైలర్ ద్వారా ఇప్పటికే ప్రేక్షకుడిలో ఆసక్తిని రేకెత్తించిన సన్నాఫ్ సత్యమూర్తి, విడుదలకు ముందే సంచనాలను నమోదు చేసింది. సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి.

ఈ సినిమా సెన్సార్‌కి సంబంధించిన కార్యక్రమాలను నేడు పూర్తి చేసుకోనుంది. ఇప్పటికే విడుదలైన ఆడియో ప్రేక్షకుల్లో మంచి హుషారును నింపింది. ఇక ట్రైలర్‌లో అల్లు అర్జున్ స్టైల్, త్రివిక్రమ్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అభిమానులైతే ఈ కాంబినేషన్ మరొక హిట్ కొట్టినట్టే అని సంబరాల్లో మునిగిపోయారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు