ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో యంగ్ హీరో !

ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో యంగ్ హీరో !

Published on Feb 25, 2019 3:44 PM IST

యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘తెనాలి రామకృష్ణ బిఎబిఎల్’. కాగా ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ ను జరుపుంటుంది. ఈ సినిమాలో సందీప్ సరసన హన్సిక కథానాయకిగా నటిస్తోంది. ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ లాంటి మంచి ఎంటర్ టైనర్ తో హిట్ అందుకున్న సందీప్కిషన్, మళ్లీ ఆ తరువాత ఆ స్థాయి కామెడీ సినిమాను చెయ్యలేదు. మళ్లీ ఇన్నాళ్లకు కామెడీనే నమ్ముకుంటున్నారు.

కాగా ఈ సినిమా ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో సాగుతుందని.. ప్రతి సీన్ లో కామెడీ హైలెట్ గా నిలిచేలా సినిమాని ప్లాన్ చేస్తున్నారట. పైగా ఈ సినిమా టైటిలే ఫన్నీగా ఉండటంతో సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు