ఆ విషయంలో పవన్ ని తలపిస్తున్న ప్రభాస్.

Published on Dec 9, 2019 11:57 am IST

స్టార్ హీరోల సినిమాల కొరకు వారి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు. సినిమా విడుదలకు ముందు ఒక నెలరోజులు ఆ తరువాత ఒక నెలరోజులు ఆ సినిమా సందడిని ఎంజాయ్ చేస్తారు. థియేటర్స్ లో ఆ హీరో మూవీ రన్ ముగియగానే కొత్త మూవీ అనౌన్స్మెంట్ మరియు అప్డేట్స్ కొరకు ఎదురుచూస్తూ ఉంటారు. మరి ఇంతగా ఎదురుచూసే అభిమానులకు కొరకు ఏడాదికి కనీసం ఒక సినిమానైనా విడుదల చేయడం హీరోల బాధ్యత. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా ఉన్న ప్రభాస్ కెరీర్ ప్రారంభం నుండి కొన్ని సార్లు మినహా ప్రతి ఏడాది రెండు సినిమాలు విడుదల చేస్తూ వచ్చారు. ఐతే 2010 నుండి ఆయన క్రేజ్ పెరిగిన తరువాత ఒక సినిమా చేస్తూ వచ్చారు.

2013లో మిర్చి తరువాత రెండేళ్లకు 2015 జులైలో బాహుబలి, 2017లో బాహుబలి 2 విడుదల చేశారు. సాహో కొరకు మరో రెండు ఏళ్ళు కేటాయించారు. తాజాగా జాన్ మూవీ వచ్చే ఏడాది విడుదల అవుతుండగా 2020లో మరో మూవీ ప్రభాస్ నుండి వచ్చే అవకాశం కనబడటం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కెరీర్ ప్రారంభం నుండి ఏడాది కి ఒకటి లేదా రెండేళ్లకు ఒక సినిమా చేస్తూ వచ్చేవారు. 2011, 2012 లో మాత్రమే ఆయన రెండు సినిమాలు విడుదల చేశారు. ఆయన సినిమాల కొరకు ఫ్యాన్స్ పడిగాపులు పడుతూ ఉండేవారు. ఇప్పుడు ప్రభాస్ కూడా అలాగే రెండేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు. ఆయన నటిస్తున్న జాన్ మూవీ షూటింగ్ 50 శాతం కూడా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ప్రభాస్ మరో మూవీ కమిట్ అవడం అది పూర్తి కావడం జరగనిపని.

సంబంధిత సమాచారం :

X
More