ఆగష్టు మూడో వారంలో నాగ చైతన్యతో, సమంత !

Published on Jul 24, 2018 8:54 am IST

నిన్ను కోరి’ చిత్రంతో హిట్ కొట్టిన యువ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, నాగ చైతన్య హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం నిన్న పూజ కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే.
గతంలో ‘ఏమాయచేసావే, ఆటో నగర్ సూర్య, మనం’ చిత్రాలు కలిసి చేసిన చైతు, సమంత పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం.

కాగా ఈ చిత్రం షూట్ ఎప్పుడు మొదలుకానుందో చిత్ర దర్శకుడు శివ నిర్వాణ తన ట్విట్టర్ ద్వారా తెలుపుతూ.. బ్యూటిఫుల్ కపుల్ తో బ్యూటిఫుల్ స్టోరీ చెప్పబోతున్నానని ఆగష్టు మూడో వారంలో షూట్ మొదలు కానుందని తెలిపారు. ఐతే ఈ చిత్రం భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని తెలిపేలా తెరకెక్కబోతుందట. హిందీ నటి దివ్యంశ కౌశిక్ కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. సాహు గరపాటి ,హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :