ఇంటర్వ్యూ : వరలక్ష్మీ శరత్ కుమార్ – ‘యశోద’లో కథే హీరో – మీ మనీకి వేల్యూ ఇచ్చే సినిమా ఇది

ఇంటర్వ్యూ : వరలక్ష్మీ శరత్ కుమార్ – ‘యశోద’లో కథే హీరో – మీ మనీకి వేల్యూ ఇచ్చే సినిమా ఇది

Published on Oct 29, 2022 9:34 PM IST


సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న తాజా సినిమా యశోద. సర్రోగసి కథాంశంతో సాగే యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీని హరి, హరీష్ తెరకెక్కించగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఇటీవల ట్రైలర్ రిలీజ్ తరువాత మరింతగా హైప్ పెంచేసింది. ఇక ఈ మూవీ నవంబర్ 11న విడుదల కానుండగా ఇందులో ఒక కీలక రోల్ చేస్తున్న ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ నేడు ప్రత్యేకంగా మూవీ గురించి పలు సంగతులను మీడియాతో పంచుకున్నారు.

 

ఈ మూవీ స్టోరీ విన్నపుడు మీ రియాక్షన్ ఏంటి ?

అసలు ఇటువంటి పాత్రలు ఎలా రాసారు, కథని ఎలా అలోచించి సిద్ధం చేసారు అనిపించింది. ఇక ఈ మూవీలో నేను గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశాను. ట్రైలర్ లో మీరు చూస్తే నా పాత్ర ఎంతో కామ్ గా ఉంటుంది. అయితే కథానుసారం సమంత పాత్ర, నా పాత్ర మధ్య ఉన్న రిలేషన్ కథనం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.

 

ఈ స్క్రిప్ట్ వరకు మీరు పేస్ చేసిన ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా ?

నిజానికి ఈ సినిమాలో నేను సమంత లాగ ఫైట్స్ వంటివి ఏమి చేయలేదు. కాకపోతే నాకు ఇచ్చిన పాత్రని మాత్రం ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకుని ఆడియన్స్ ని ఆకట్టుకునేలా పెర్ఫార్మ్ చేశాను. నేను చేసే ప్రతి సినిమాలోని పాత్రని ఛాలెంజింగ్ గా తీసుకుని చేయాలనే నేను భావిస్తాను.

 

ఈ మూవీ చేయడానికి కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలు ఏమైనా ఉన్నాయా ?

నిజానికి సినిమాలో సమంత పాత్రతో పాటు నా పాత్ర కూడా ప్యారలెల్ గా ఉంటుంది. ఆమెది మెయిన్ పాత్ర అయినప్పటికీ ఒకానొక సందర్భంగా ఆమె పాత్ర కి ఒకరు అవసరం అవుతారు. ఆ విధంగా న పాత్ర ద్వారా మరొక స్టార్ లీడ్ రన్ అవుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా యాక్షన్ తో సాగె సైన్స్ ఫిక్షన్ డ్రామా మూవీ అని చెప్పవచ్చు. ఆ విధంగా నాది కూడా సమంత తరువాత పెద్ద పాత్ర అనే చెప్పాలి. ఇంతకంటే ఎక్కువ చెపితే సినిమా యొక్క ఫీల్ మీరు మిస్ అవుతారు.

 

ఇందులో మీది డాక్టర్ క్యారెక్టరా ?

అదేమి కాదు అండి. మీరు ట్రైలర్ లో చూసింది సర్రోగసి ఫెర్టిలిటీ సెంటర్. దాని హెడ్ పాత్ర చేశాను, ఆమె చాలా రిచ్ మరియు డబ్బు అంటే ఎంతో ఇష్టం. నా నిజ జీవితానికి పూర్తి విరుద్ధంగా ఉండేలా డ్రెసింగ్ కూడా ఇందులో ఉంటుంది. ఒకరకంగా చెప్పాలి అంటే తనను తాను ప్రేమిచుకునే పాత్ర అది.

 

దర్శకులు హరీష్, హరి గురించి చెప్పండి ?

దర్శకులు ఇద్దరూ కూడా ఎంతో మంచి టాలెంట్ కలిగిన వారు. ముఖ్యంగా వారిద్దరూ తమ పని తాము చేసుకుంటూ కామ్ గా ముందుకి సాగే మంచి వ్యక్తులు. వారిని సెట్ లో ఎప్పుడూ అరవడం అనేది చూడనే లేదు. ఇంత కామ్ గోయింగ్ డైరెక్టర్స్ ని నేను ఎప్పుడూ చూడలేదు. అలానే స్టోరీ ని క్యారెక్టర్స్ ని ఎంతో రీసెర్చ్ చేసుకుని రాసుకున్నారు. అలానే ఈ సినిమాలో లేడీ క్యారెక్టర్స్ ని చాలా మంది రిలేట్ చేసుకుంటారు.

 

టెక్నీకల్ గా ఈ సినిమా గురించి చెప్పండి?

సినిమా టెక్నీకల్ గా క్వాలిటీ విషయంలో ఎంతో అద్భుతంగా ఉంటుంది. మణిశర్మ గారి సంగీతం, బీజీఎమ్ తో పాటు ఫోటోగ్రాఫర్ సుకుమార్ గారు సినిమాకి ప్రాణం పెట్టి పని చేసారు. మీరు పెట్టె టికెట్ రేట్ ని పూర్తి న్యాయం చేస్తుంది ఈ మూవీ. ఇక నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ గారు ఎంతో భారీ వ్యయంతో సెట్స్ వేసి సినిమా తీశారు. మొత్తంగా టీమ్ మొత్తం పడ్డ కష్టం రేపు మీకు తెరమీద కనపడుతుంది.

 

సరోగసీ గురించి ఇండియాలో డిస్కషన్స్ జరుగుతున్నాయి. కథ ఏ విధంగా ఉండబోతోంది?

నిజానికి సర్రోగసి అనేది కాంప్లికేటెడ్ కాదు. అయితే ఇటీవల కొందరు నటులు సర్రోగసి ఆశ్రయించి బిడ్డలను కనడం వలన ఈ విధంగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. అయితే సర్రోగసి ద్వారా బిడ్డలను పొందే అవకాశం కలుగుతోంది. నిజానికి ఈ స్టోరీ లో సర్రోగసి అనేది ఒక టాపిక్ మాత్రమే, అందులో మంచి చెడు లు చెప్పడమే అనేది ఉండదు. పూర్తిగా ఇది ఫిక్షనల్ స్టోరీ, అయితే సమాజంలో అటువంటి మనుషులు ఉన్నారు అని చెప్పడమే ఈ కథ.

 

ఈ మూవీలో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి ?

నిజానికి ఈ స్టోరీలో నా పాత్ర కూడా ఎంతో బాగా నచ్చింది, అందులో డెప్త్ బాగుంది. అలానే యశోద పాత్ర చేసిన సమంత కూడా ఎంతో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసారు. అలానే నాకు రావు రమేష్ గారికి అలానే నాకు ఉన్ని ముకుందన్ గారికి మధ్య వచ్చే సీన్స్ కూడా ఆకట్టుకుంటాయి. అయితే మొత్తంగా చెప్పాలి అంటే ఈ మూవీలో స్టోరీ నే మెయిన్ హీరో అని చెప్పాలి. మేమంతా అందులో పాత్రధారులం అంతే.

 

సమంత తో ఫస్ట్ టైం వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎలా అనిపించింది ?

నిజానికి నాకు సమంత తో పన్నేదేళ్ళ క్రితమే చెన్నై లో పరిచయం ఉంది. ఇక ఈ మూవీ షూటింగ్ టైం లో మధ్యలో నేను జోక్స్ వేస్తుండడం తను ఎంతో ఎంజాయ్ చేస్తూ నవ్వుతుండడం జరిగేది. అయితే సీన్ కి ముందు నేను జోక్స్ వేస్తుండడంతో ఇదే టైం లో జోక్స్ వేయాలా అంటూ తాను ఎంతో సరదాగా మాట్లాడుతుండేది. ఆ విధంగా తనతో ఎంతో హ్యాపీగా షూటింగ్ జరిగింది. తాను స్ట్రాంగ్ ఉమెన్, కృషి పట్టుదలతో పైకి వచ్చిన మంచి నటి. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడింది.

 

తెలుగులో మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక్కడి ఆడియన్స్ గురించి ఏమి చెప్తారు ?

నిజానికి రవితేజ గారి క్రాక్ లో జయమ్మ పాత్ర తరువాత నాకు మరింత మంచి పేరు లభించింది. అక్కడి నుండి నాకు అవకాశాలు మరింతగా పెరిగాయి. అలానే తెలుగులోనే ఎక్కువగా రోల్స్ వస్తున్నాయి. తమిళ సినిమాలు చేసే టైం కూడా లేదు. ఆ విధంగా ఇక్కడి ఆడియన్స్ నన్ను ఓన్ చేసుకున్నారు. నాకు స్టీరియో టైపు క్యారెక్టర్స్ చేయడం రాదు. అది సంతోషంగా ఉంది.

 

ప్రస్తుతం మీరు చేస్తున్న సినిమాలు ఏంటి ?
శబరి అనే మూవీ చేస్తున్నా, అందులో నాది లీడ్ రోల్. అలానే బాలకృష్ణ గారి వీరసింహారెడ్డి లో నాది క్రేజీ క్యారెక్టర్. అలానే మరి కొన్ని సినిమాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు