దేశభక్తి, మానవత్వాన్ని చాటి చెప్పిన ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’..!

Published on Aug 11, 2021 12:00 am IST

తెలుగు బుల్లితెర‌ ప్రేక్షకులకు కడుపుబ్బా కామెడీని అందిస్తున్న కార్యక్రమాల్లో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కూడా ఒకటి. సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం ఈటీవీలో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. అయితే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రూపొందించిన స్పెషల్ ఎపిసోడ్‌ ఆగస్టు 15న ప్రసారం కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది.

అయితే ఈ స్పెషల్ ఎపిసోడ్‌కు ప్రముఖ నటి ఆమని గెస్ట్‌గా వచ్చారు. సుధీర్‌పై ఆమె వేసిన పంచ్‌లు నవ్వులు పూయించాయి. ఇక ‘ఈ వర్షం సాక్షిగా’ అంటూ నలుగురు కలిసి చేసిన డ్యాన్స్ ఆద్యంతం ఆకట్టుకుంది. సునామీ సుధాకర్ బొమ్మగా, బొమ్మతో మాట్లాడించే వ్యక్తిగా బుల్లెట్ భాస్కర్ కనిపించడం, మధ్యలో సుధాకర్ డైలాగ్స్ మరిచిపోవడం హిలేరియస్‌గా అనిపించాయి. ఒక టీం ‘వందేమాతరం’ గీతం ఆలపించి ప్రతి ఒక్కరిలో దేశ భక్తిని రగిల్చేలా చేశారు. ఇక ఆటో రామ్‌ ప్రసాద్‌ చేసిన స్కిట్ చూసి అందరూ చలించిపోయారు. మానవత్వం ముందు ఏ కులాలు, మతాలు పనికిరావని చాటి చెప్పారు. మరీ ఈ ఫుల్ ఎపిసోడ్‌ను మిస్ కాకూడదంటే మాత్రం స్వాతంత్ర దినోత్సవం రోజు “శ్రీదేవి డ్రామా కంపెనీని” తప్పక చూడాల్సిందే.

ప్రొమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :