బాలయ్య నెక్స్ట్ కి ఇండియాస్ హ్యాపెనింగ్ నటుడు.?

Published on Aug 12, 2021 9:00 am IST


ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “అఖండ” షూట్ లో కీలక షెడ్యూల్ ని మేకర్స్ నిన్ననే కంప్లీట్ చేసుకున్నారు. మరి ఈ భారీ చిత్రం అనంతరం బాలయ్య మరో మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో మరో మాస్ ఎంటర్టైనర్ చేయనున్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు దానిపైనే ఆసక్తికర బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రానికి గాను గోపీచంద్ అదిరే క్యాస్టింగ్ ని సిద్ధం చేస్తున్నాడట. అందులో భాగంగానే ఇండియాస్ మోస్ట్ హ్యాపెనింగ్ వెర్సటైల్ నటుడిని ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది. అతడు మరెవరో కాదు విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అట..

అయితే ఇంకా ఇందులో ఎలాంటి అధికారిక సమాచారం లేదు కానీ టాక్ మాత్రం వైరల్ అవుతుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :