మన ఇండియన్ సినిమా దగ్గర ఒక గేమ్ ఛేంజింగ్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా బాహుబలి సినిమానే అని చెప్పవచ్చు. అప్పుడు వరకు ఉన్న తెలుగు సినిమా వేరు ఈ సినిమా వచ్చిన తర్వాత తెలుగు సినిమా వేరు అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా తర్వాత నుంచే పాన్ ఇండియా మార్కెట్ రూపు రేఖలు కూడా మారిపోయాయి.
దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ఏమనుకొని ప్రభాస్ తో ఈ సినిమా స్టార్ట్ చేసారో కానీ ఇపుడు తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా అందుకుంటున్న మన్ననలకి ఈ సినిమానే ప్రధాన కారణం అని చెప్పవచ్చు. అయితే ఈ చిత్రం థియేటర్స్ లో బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. మరి ఈ తర్వాత అప్పుడు నుంచి మళ్ళీ థియేటర్స్ లో రీరిలీజ్ అయ్యింది లేదు. కానీ ఇపుడు మళ్ళీ థియేటర్స్ లో ఈ ఎపిక్ రీరిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.
బాహుబలి 1 చిత్రం 2015 జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మరి ఈ డేట్ నుంచి సరిగ్గా పది సంవత్సరాలు తర్వాత మళ్ళీ ఈ 2025లో అదే డేట్ కి విడుదల అయ్యే సూచనలు ఇపుడు కనిపిస్తున్నాయి. దీంతో ఈ స్పెషల్ డేట్ లో వచ్చే ఈ చిత్రం ఇపుడు ఉన్న రీరిలీజ్ ట్రెండ్ లో డెఫినెట్ గా భారీ రికార్డులు సెట్ చేయవచ్చు అని చెప్పవచ్చు. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.