పాకిస్థానీ ఆర్టిస్టులను బ్యాన్ చేసిన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ !

పాకిస్థానీ ఆర్టిస్టులను బ్యాన్ చేసిన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ !

Published on Feb 19, 2019 12:50 PM IST

ఇటీవల జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా లో జరిగిన టెర్రర్ అటాక్ లో 49 మంది భారత జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన భారతీయులందరిని బాధించింది. ఈ పరిణామంతో అల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ,ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో పని చేస్తున్న పాకిస్థానీ ఆర్టిస్టులపై బ్యాన్ విధించింది. నటీనటులైన , సింగర్స్ అలాగే సాంకేతిక నిపుణలైన గాని వారిని ఇక మీదట ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో తీసుకోబడదు అని అసోసియేషన్ తీర్మానించింది. ఒకవేళ ఎవరైనా ఈ రూల్స్ బ్రేక్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

పాకిస్థాన్ కు చెందిన మహీరా ఖాన్ , ఫవాద్ ఖాన్ , రహత్ ఫతే అలీ ఖాన్ (సింగర్) , ఆతిఫ్ అస్లమ్ (సింగర్ ) తదితరులు ఇంతకుముందు బాలీవుడ్ చిత్రాలకు పనిచేశారు. బాలీవుడ్ సినిమాలు పాకిస్థాన్ లో కూడా విడుదలవుతుంటాయి. తాజాగా జరిగిన ఈ ఉదంతంతో బాలీవుడ్ స్టార్ హీరోలు తమ సినిమాలను అక్కడ విడుదలచేయవద్దని నిర్మాతలను కోరుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు