ఇంటర్వ్యూ : ఇంద్రా – ఇది సోషియో ఫ్యాంట‌సీ అండ్ మైథ‌లాజిక‌ల్ మూవీ.

Published on Feb 14, 2019 5:28 pm IST

సూర్య ఎంఎస్ఎన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రఖ్యాత నటీమణి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతోన్న చిత్రం “సువర్ణసుందరి”. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది అన్నది క్యాప్షన్. భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఓ సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి రెండ‌వ వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్ర హీరో ఇంద్రా విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ… ఈ చిత్రంలో న‌టించ‌డం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఇంత మంచిగా రావ‌డానికి ప్ర‌ధాన‌కార‌ణం సూర్య‌గారే. ఇక ఇందులో నేను లీడ్ రోల్‌లో న‌టించాను. ఈ చిత్రాని కంటే ముందు నేను వంగ‌వీటిలో న‌టించాను. నా రోల్ రొమాంటిక్‌గా ఉంటుంది. సాక్షికి పెయిర్‌ గా చేశాను. డ‌బ్బింగ్ చెప్పినప్పుడు చూస్తే సినిమా చాలా బాగా వ‌చ్చింది. అసలు సువ‌ర్ణ సుంద‌రి అంటే… ఒక విగ్ర‌హం. ఆ కాలం ఆరు వంద‌ల సంవ‌త్స‌రాల‌ నుంచి ఈ కాలం వ‌ర‌కు క‌థ‌ ట్రావెల అవుతుంది. ఒక సోషియో ఫ్యాంట‌సీ అండ్ మైథ‌లాజిక‌ల్ మూవీ ఇది.

ఇంద్ర ఇంకా మాట్లాడుతూ.. విఎఫ్ఎక్స్ సినిమాకి బాగా కుదిరాయి మంచి అనుభూతినిస్తాయి. ఈచిత్రానికి ప‌నిచేసిన టెక్నీషియ‌న్స్ అంద‌రూ మంచి మంచి టెక్నీషిన్స్‌. ఇక జ‌య‌ప్ర‌ద‌గారి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆమె న‌టించిన సినిమాలో చేయ‌డం నా అదృష్టం.

ప్రస్తుతం నేను రామ‌చ‌క్క‌ని సీత అనే చిత్రంలో చేస్తున్నాను. అలాగే ఓంకార్ గారి అసిస్టెంట్ శ్రీ‌హ‌ర్ష మండా గారితో ఓ సినిమా చేస్తున్నాను.

సంబంధిత సమాచారం :

X
More