ఇంట్రెస్టింగ్‌గా “ఇందువదన” టీజర్..!

Published on Aug 4, 2021 8:36 pm IST

బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత హీరో వరుణ్ సందేశ్ చేస్తున్న తొలి చిత్రం “ఇందువదన”. ఫర్నాజ్‌ శెట్టి కథానాయికగా ఎంఎస్ఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ బాలాజీ పిక్చర్స్‌ పతాకంపై మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నారు. ఇందులో అటవీ శాఖ అధికారిగా వరుణ్, గిరిజన యువతిగా ఫర్నాజ్ శెట్టి కనిపించబోతున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు, వరుణ్ మేకోవర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

అయితే తాజాగా ఈ సినిమా టీజర్‌ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు విడుదల చేశారు. టీజర్ విషయానికి వస్తే రొమాన్స్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఇంట్రెస్టింగ్‌గా సాగింది. గిరిజనులు మాట్లాడే “అస్కర బస్కా, లష్కర్‌ తుష్క” అనే పదాలు ఆకట్టుకున్నాయి. అయితే హీరోని ఎవరో చంపే ప్రయత్నం చేయగా చావడన్నా.. వీడు చావడు.. ఎందుకంటే నేను ఇంకా బతికే ఉండా కదా! అని హీరోయిన్ పలికించిన హావాభావాలు, టీజర్ ముగింపులో హీరోయిన్ దెయ్యంగా మారి చంపేస్తాన్‌రరేయ్.. అని బెదిరించడం ఉత్కంఠని రేకెత్తించాయి. ఇక ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ప్లస్ అయ్యేలా అనిపిస్తుంది. ఆద్యంతం ఆసక్తి రేపుతున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :