చరణ్, శంకర్ ల ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ బజ్!

Published on Aug 7, 2021 3:20 pm IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రెజెంట్ రెండు భారీ మల్టీ స్టారర్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ రెండు సినిమాలు అనంతరం చరణ్ ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తారా అన్న టైం శంకర్ తో అనౌన్స్ చేసి సంచలనం నమోదు చేసాడు. ఇక అక్కడ నుంచి భారీ హైప్ తో నడుస్తున్న ఈ చిత్రం నుంచి పలు కీలక అప్డేట్స్ ని కూడా మేకర్స్ అందిస్తూ వస్తున్నారు.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంపై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. ఈ చిత్రంలో పలు కీలక సన్నివేశాలను మొదటగా తెలంగాణాలో శంకర్ ప్లాన్ చేశారట. ఆ తర్వాత ఇక్కడ షూట్ అనంతరం విదేశాల్లో షూట్ కి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ షూట్ వచ్చే సెప్టెంబర్ రెండో వారం నుంచి స్టార్ట్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్.

అలాగే ఈ చిత్రానికి గాను కియారా భారీ రెమ్యునరేషన్ నే తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది.. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా చరణ్, శంకర్ ల కెరీర్ లో బెంచ్ మార్క్ సినిమా అయినటువంటి దీనిని దిల్ రాజు తమ బ్యానర్ నుంచి ప్రిస్టేజియస్ 50వ ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం :