ప్రభాస్ 21లో దీపికా పాత్రపై క్రేజీ గాసిప్..!

ప్రభాస్ 21లో దీపికా పాత్రపై క్రేజీ గాసిప్..!

Published on Jul 21, 2020 7:28 AM IST

ప్రభాస్ 21 మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్ గా చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. రెండు నెలలుగా దీపికా ప్రభాస్ 21 హీరోయిన్ అంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ ప్రకటన పెద్దగా సర్ప్రైజ్ పంచలేదు. బాలీవుడ్ టాప్ యాక్ట్రెస్ గా ఉన్న దీపికా మొదటిసారి ప్రభాస్ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టడంతో ఫ్యాన్స్ హ్యాపీ గా ఉన్నారు. కాగా ఈ మూవీ కోసం భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి దీపికాను తీసుకోవడానికి కారణం కథలోని ఆమె పాత్రనే అని తెలుస్తుంది.

ప్రభాస్ 21 మూవీలో దీపిక పదుకొనె ప్రొఫెషనల్ డాన్సర్ రోల్ చేస్తుందట. పాత్ర దృష్ట్యా అద్భుతమైన డాన్సింగ్ స్కిల్స్ ప్రదర్శించాల్సి ఉంటుందట. అందుకే ఏరికోరి దీపికను ఎంచుకున్నారని సమాచారం. ఇక ఈ మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ సైతం రాజు పక్కన సరిజోడైన రాణి ఉండాలిగా, ఎంతో అలోచించి తీసుకున్న నిర్ణయం ఇది అన్నారు. దీనితో దీపికాకు కథలో కీలకమైన పాత్రై ఉండే అవకాశం కలదు. ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం 2022లో విడుదల కానుంది. సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు