మహేష్ మాస్ ట్రీట్స్ పై ఇంట్రెస్టింగ్ బజ్.!

Published on Jul 8, 2021 11:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వం తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి సాలిడ్ ట్రీట్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో వస్తుంది అని ఎప్పటి నుంచి టాక్ ఉంది.

అయితే నిజానికి ఈ ఈ ఫస్ట్ లుక్ ఎప్పుడో రావాల్సి ఉంది కానీ పరిస్థితులు రీత్యా వాయిదా వేసినట్టు తెలిపారు. ఇక నెక్స్ట్ టార్గెట్ మహేష్ బర్త్ డే కే అని ఫిక్స్ అయ్యింది. మరి ఆ స్పెషల్ డే కి ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ సహా గ్లింప్స్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఈ గ్లింప్స్ విషయం ఏమో కానీ ఫస్ట్ సింగిల్ పై కూడా స్ట్రాంగ్ బజ్ ఉంది.

ఇది వరకే థమన్ కూడా పలుమార్లు కన్ఫర్మ్ చేసాడు. సో ఈ సారి మహేష్ బర్త్ డే కి మహేష్ మాస్ ట్రీట్స్ గట్టిగానే ఉంటాయని చెప్పాలి. ఇక ఈ సాలిడ్ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :