బన్నీ, మహేష్ కోసం ఆర్ ఆర్ ఆర్ హీరోలు వస్తారట.. !

Published on Dec 11, 2019 7:10 am IST

ఈ సంక్రాంతి తెలుగు సినిమా అభిమానులకు చాలా ప్రత్యేకం అని చెప్పాలి. దానికి కారణం టాలీవుడ్ ఇద్దరు టాప్ హీరోలైన మహేష్, అల్లు అర్జున్ ఒక రోజు వ్యవధిలో థియేటర్స్ లో దిగనున్నారు. మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు జనవరి 11న విడుదల అవుతుండగా, బన్నీ అలవైకుంఠపురంలో 12న విడుదల అవుతుంది. కాంబినేషన్స్ దృష్ట్యా ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలున్నాయి.

కాగా ఈ రెండు చిత్రాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జనవరి మొదటి వారంలో జరగనున్నాయి.ఐతే ఈ మెగా ఈవెంట్స్ కి వచ్చే అతిధుల విషయంలో ఆసక్తికర వార్త ఒకటి ప్రచారంలో ఉంది. జక్కన్న తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఈ ఈవెంట్స్ కి వేరు వేరుగా హాజరయ్యే అవకాశం కలదని సమాచారం. ఎన్టీఆర్ సరిలేరు నీకెవ్వరు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిధిగా వచ్చే అవకాశం ఎక్కువగా కలదు. గతంలో ఓ వేడుకలో మహేష్, తారక్ సందడి చేశారు. వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం కూడా బాగా ఉంది.

ఇక అలవైకుంఠపురంలో చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు చరణ్ హాజరయ్యే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది. లేదా బన్నీ అలవైకుంఠపురంలో వేడుకకు తారక్, సరిలేరు నీకెవ్వరు కొరకు చరణ్ వచ్చినా రావచ్చు. ఒకవేళ ఇది నిజమైనప్పటికీ ఇప్పటికే అనేక కారణాల చేత ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఆలస్యమైంది. ఈ తరుణంలో జక్కన వీరు ఈ వేడుకలకు హాజరయ్యే అవకాశం ఇస్తారా అనే అనుమానం కలుగుతుంది.

సంబంధిత సమాచారం :

More