“అఖండ” సాలిడ్ క్లైమాక్స్ పై ఇంట్రెస్టింగ్ డీటెయిల్.!

Published on Jul 2, 2021 10:02 pm IST


ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో “అఖండ” అనే సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో దీనిపై మరిన్ని అంచనాలు ఉన్నాయి. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం ఇప్పుడు ఒక్క క్లైమాక్స్ షూట్ మాత్రమే మిగిలి ఉంది.

దాని కోసం లొకేషన్స్ వేటలో కూడా దర్శకుడు బోయపాటి ఉన్నాడు. అయితే ఈ సీక్వెన్స్ ను బోయపాటి అదిరే లెవెల్లో ప్లాన్ చేస్తున్నారని గట్టి టాక్. మరి ఇందులో బాలయ్య ఎలా కనిపిస్తారు అన్నదానిపై బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో కూడా ఇంతకుముందు బోయపాటి సినిమాల్లానే రెండు డిఫరెంట్ షేడ్స్ లోనే బాలయ్య కనిపిస్తున్నారు. వాటిలో అఘోర రోల్ కూడా ఒకటి.

దానిపై రిలీజ్ చేసిన టీజర్ కి కూడా నెవర్ బిఫోర్ రెస్పాన్స్ వచ్చింది. మరి ఆ గెటప్ తోనే అఖండ క్లైమాక్స్ ఉండనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే బాలయ్య కూడా అదే లుక్ నే రెడీ చేసి ఉంచుకున్నారు. దీనితో అది మరోసారి కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :