“కేజీయఫ్ 2” రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ డీటెయిల్.?

Published on May 26, 2021 7:06 am IST

ఇండియన్ సినిమా దగ్గర భారీ అంచనాలతో విడుదలకు దగ్గరలో ఉన్న పలు చిత్రాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ మరియు శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్స్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఒకటి. అయితే ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా విడుదల తేదీని మేకర్స్ వచ్చే జూలై 16కి ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

కానీ మధ్యలో కరోనా రెండో వేవ్ రావడంతో పలు అనుమానాలు మొదలయ్యాయి. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం మళ్ళీ మేకర్స్ అనుకున్న సమయానికే తీసుకొని వస్తారని టాక్ ఉన్నా మరో పక్క నిన్న విడుదల చేసిన మ్యాగజైన్ లో రిలీజ్ డేట్ ను చూపించారు. విలక్షణ నటుడు రావు రమేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తన రోల్ రివీల్ చేసిన పేపర్ లో ఒక స్టాంప్ ని గమనిస్తే కనిస్తుంది.

అయితే అందులో “నెక్స్ట్ చాప్టర్ వచ్చే జూలై 16 నుంచి కంటిన్యూ అవుతుంది” అని పొందుపరిచారు. అంటే అదే రోజున సినిమా విడుదల చేస్తారా లేదా మరో కీలక మ్యాగజైన్ లాంటిది విడుదల చేస్తారా అన్నది ప్రశ్నగా మారింది. దీనితో జూలై 16 నాటికి ఈ చిత్రం విడుదల అవుతుందా లేదా అన్నది మరోమారు ఆసక్తిగా నిలిచింది.

సంబంధిత సమాచారం :