“RRR” సెకండ్ సింగిల్ పై ఇంట్రెస్టింగ్ డీటెయిల్.!

“RRR” సెకండ్ సింగిల్ పై ఇంట్రెస్టింగ్ డీటెయిల్.!

Published on Aug 10, 2021 10:57 AM IST

ప్రస్తుతం “RRR” సినిమా యూనిట్ ఉక్రెయిన్ షూట్ లో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కూడా ఈ షూట్ లో పాల్గొంటున్నారు. అలాగే ఒలీవియా పై కూడా కీలక సన్నివేశాలను మేకర్స్ తెరకెక్కించారు. అయితే దీనితో పాటుగా అక్కడ ఓ అదిరే సాంగ్ ని కూడా ఇప్పుడు చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే.

మరి ఈ సాంగ్ పైనే ఇంట్రెస్టింగ్ బజ్ అండ్ డీటెయిల్ ఇప్పుడు వినిపిస్తుంది. మేకర్స్ డిజైన్ చేసిన ఈ సాంగ్ రామ్ చరణ్ చేస్తున్న అల్లూరి ఒకరి రోల్ పైనే అని తెలుస్తుంది. ఇద్దరి హీరోలపై కంబైన్డ్ సాంగ్ గా కాకుండా మేకర్స్ ఇస్తున్న హింట్స్ ప్రకారం ఇది చరణ్ ఒకడి పై సాంగ్ మాత్రమే అని అర్ధం అవుతుంది..

అందుకే చరణ్ పై డ్రమ్స్ వీడియో అన్నట్టు కొన్ని వీడియో మరియు ఫోటోలు బయటకి వస్తున్నాయి. ఇక ఇదే సాంగ్ ఈ చిత్రం నుంచి రెండో పాటగా బహుశా రిలీజ్ కానుంది అని టాక్. మరి కీరవాణి సంగీతం అందించిన ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు