
కెరీర్ ప్రారంభం నుంచే గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ లాంటి డిఫరెంట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్న డైరెక్టర్ క్రిష్ ఈ సారి 1935- 45 టైం లోకి వెళ్లి అక్కడి పరిస్థితులు మరియు అప్పటి వరల్డ్ వార్ II చుట్టూ కథని అల్లుకుంటూ చేసిన సినిమా ‘కంచె’. మెగా ఫ్యామిలీ యంగ్ హీరో వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని ఇటీవలే సెన్సార్ ని కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ నుంచి ‘యు/ ఏ’ సర్టిఫికేట్ తో పాటు సూపర్బ్ సినిమా తీసారనే కితాబులను కూడా అందుకున్నారు.
తాజాగా ఈ సినిమా కోసం వేసిన ఓ భారీ హౌస్ సెట్ గురించిన విశేషాలు తెలిసాయి. ఈ సినిమాలో హీరోయిన్ పెద్ద జమిందార్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. ఆ జమిందార్ హౌస్ కోసం ఓ కోట లాంటి భవనాన్ని సెట్ గా వేసారు. సుమారు 5 రోజుల పాటు కంటిన్యూగా వర్క్ చేసి వేసిన ఈ సెట్ కోసం 40 లక్షలు ఖర్చు పెట్టారు. ఒక స్టార్ హీరో సినిమాకి ఈ రేంజ్ కాస్ట్ పెట్టి సెట్ వేయడం పెద్ద మాటర్ కాకపోవచ్చు, కానీ వరుణ్ తేజ్ రెండో సినిమాకే ఇంత పెట్టి సెట్ వేయడం చెప్పుకోదగిన విషయం. అంతే కాకుండా అప్పటి చెన్నై సెంట్రల్ క్లబ్, ఒక రైల్వే ట్రాక్ సెట్ తో పాటు ఒక గ్రామం మొత్తాని తమకు తగ్గట్టు సిద్దం చేసారు. దీని కోసమే కంచె టీం భారీగా ఖర్చు పెట్టిందని సమాచారం.
వరుణ్ తేజ్ సరసన ప్రాగ్య జైశ్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ నికేతన్ దీర్ విలన్ గా కనిపించనున్నాడు. 1947 బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ ప్రేమకథ ద్వారా చిరంతన్ భట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు.

