ఎన్టీఆర్ బయోపిక్ లో హరికృష్ణ గురించి ఆసక్తికరమైన విషయాలు !

ఎన్టీఆర్ బయోపిక్ లో హరికృష్ణ గురించి ఆసక్తికరమైన విషయాలు !

Published on Sep 10, 2018 5:15 PM IST

నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా క్రిష్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ప్రస్తుతం అసెంబ్లీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. భారీ తారాగణం నటిస్తోన్న ఈ చిత్రంలో తాజాగా ‘నందమూరి కళ్యాణ్ రామ్’ తన తండ్రి హరికృష్ణ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

కాగా, హరికృష్ణగారు హఠాన్మరణంతో నందమూరి కుంటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్ తో పాటుగా బాలకృష్ణ కూడా తన ఆన్నగారి మృతి పట్ల తీవ్రంగా కలత చెందిన విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ బయోపిక్ లో హరికృష్ణ పాత్రను ఇంకా పెంచాలని, సీనియర్ ఎన్టీఆర్ కోసం, పార్టీ కోసం, ఆయన చేసిన సేవలను కొన్నైనా చిత్రంలో చూపించాలని బాలకృష్ణ నిర్ణయించుకున్నారట.

ప్రస్తుతం రచయిత సాయి మాధవ్ బుర్రా స్క్రిప్ట్ లో హరికృష్ణ’ పాత్రను ఇంకా పెంచేవిధంగా వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ‘ఎన్టీఆర్ చైతన్య రథానికి’ ‘హరికృష్ణ’ సారధిగా వ్యవహరించిన విషయం తప్ప. ఆయన చేసిన చాలా పనులు పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ హరికృష్ణగారు తన సినీ కెరీర్ ను త్యాగం చేసి మరీ అనుక్షణం ఎన్టీఆర్ గారిని కనిపెట్టుకొని ఉన్నారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడే రాజకీయంగా ఎదిగే అవకాశం వచ్చినా.. కుటుంబ పాలన చేస్తున్నాడని, తండ్రికి చెడ్డ పేరు వస్తుందని, రాజకీయ పదవులను హరికృష్ణ కాదనుకున్నారట. ఇలాంటి కొన్ని అంశాలను ఎన్టీఆర్ బయోపిక్ లో చూపించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు