కరెప్టెడ్ పోలీస్,మాఫియా బాస్ మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్

Published on Aug 11, 2019 1:08 pm IST

ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. ఒకటి శర్వానంద్ నటించిన రణరంగం కాగా,రెండవది హీరో అడివి శేషు నటించిన “ఎవరు”. రణరంగం చిత్రంలో శర్వానంద్ కింది స్థాయి నుండి ఎవరికీ అందనంత స్థాయికి ఎదిగిన గ్యాంగ్ స్టర్ పాత్ర చేస్తున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మద్యపాన నిషేధాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని, ఎదురొచ్చిన వాడిని పడగొడుతూ ఎలా ఎదిగాడన్నదే మూవీ ప్రధాన కధాంశంగా కనబడుతుంది. లవర్ బాయ్ గా, సీరియస్ గ్యాంగ్ స్టర్ గా రెండు విభిన్న అవతారాలలో శర్వా అలరిస్తారని ట్రైలర్ చుస్తే అర్థం అవుతుంది.

ఇక హీరో అడివి శేషు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఎవరు’ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. అడివి శేషు ఈ మూవీలో విక్రమ్ వాసుదేవ్ అనే నెగెటివ్ షేడ్స్ ఉన్న కరెప్టెడ్ పోలీస్ అధికారిగా కనిస్పిస్తున్నారు. రెజీనా కాసాండ్రా కు సంబంధం ఉన్న ఓ హత్య కేసు చుట్టూ తిరిగే మిస్టీరియస్ డ్రామాలా అనిపిస్తుంది. కన్నింగ్ ఆటిట్యూడ్ కలిగిన పోలీస్ అధికారిగా అడివి శేషు నటన అద్భుతంగా ఉంది. ‘ఎవరు’ మూవీ ట్రైలర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకొని, యూట్యూబ్ లో ఊహించని వ్యూస్ రాబట్టింది.

ఈ రెండు చిత్రాలు బాక్సాపీస్ వద్ద పోటీపడనుండటంతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది. ఇప్పుడిది గ్యాంగ్ స్టర్ కి మాఫియా బాస్ కి కరెప్టెడ్ పోలీస్ అధికారికి మధ్య జరిగే బాక్సాపీస్ ఫైట్ అని చెప్పుకోవచ్చు. ఐతే ఈ రెండు చిత్రాలు విభిన్నమైన జానర్స్ కి సంబంధించిన చిత్రాలు కావడంతో ఇవి ఒకటికొకటి పోటీగా మారే అవకాశం లేదని చెప్పొచ్చు. ‘రణరంగం’ మూవీ గ్యాంగ్ స్టర్ స్టోరీతో తెరకెక్కిన కమర్షియల్ మూవీ కాగా, ‘ఎవరు’ క్రైమ్ థ్రిల్లర్.

సంబంధిత సమాచారం :