ఆకట్టుకుంటున్న సత్యదేవ్ “స్కై ల్యాబ్” ఫస్ట్ లుక్!

Published on Jul 11, 2021 11:08 pm IST

తెలుగు సినీ పరిశ్రమలో నటుడు గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సత్యదేవ్. వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో నెమ్మదిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలు భిన్న కథాంశాలతో సినిమాలని ప్రకటించిన సత్యదేవ్ మరొక ఫన్ ఎంటర్ టైనర్ తో మన ముందుకు వచ్చేందుకు సిద్దం గా ఉన్నారు. తాజాగా తను హీరో గా నటించిన స్కై ల్యాబ్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు సత్యదేవ్.

అయితే ఈ చిత్రం లో సత్యదేవ్ సరసన హీరోయిన్ గా నిత్యా మీనన్ నటిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి పృథ్వి పిన్నమరాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా, e చిత్రానికి విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. సత్యదేవ్ ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం తో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :