“ఆదిపురుష్” లో గ్రాఫికల్ వర్క్ కే ఇంత సమయమా.?

Published on Aug 6, 2021 9:00 am IST


పాన్ ఇండియన్ సూపర్ స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో భారీ పాన్ ఇండియన్ చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. భారీ హంగులతో దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా కూడా అంతే స్థాయి అంచనాలు నెలకొన్నాయి. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు ప్రభాస్ షాట్స్ లేని షూట్ ని శరవేగంగా జరుపుకుంటుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంపై ఓ ఊహించని టాక్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా ఇప్పటి వరకు మన ఇండియన్ సినిమా దగ్గర రానంత భారీ విజువల్స్ తో వస్తుంది అని మేకర్స్ ముందు నుంచీ చెబుతున్నారు. ఆ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కే షూటింగ్ కాకుండా పది నెలలు అలా సమయం పడుతుందట.

ఎంత వరకు ఇందులో నిజముందో కానీ ఈ సినిమా పరంగా మాత్రం ప్రస్తుతం ఈ టాక్ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఈ చిత్రంలో సీతగా కృతి సనన్ నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ రావణ పాత్రలో నటిస్తున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని మేకర్స్ 3డి లో వచ్చే ఏడాది ఆగష్టు నాటికి రిలీజ్ చెయ్యాలని ప్లాన్ లో ఉన్నారు. మరి ఈ ప్రకారం ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :