అక్కినేని హీరోకి బావగా అల్లు అర్జున్…?

Published on Jul 17, 2019 2:13 pm IST

మాటలమాంత్రికుడు త్రివిక్రమ్,అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి,సన్ ఆఫ్ సత్యమూర్తి విజయం సాధించడంతో మూడవ చిత్రంగా వస్తున్న ఈ మూవీ పై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. గీతా ఆర్ట్స్,హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అల్లు అర్జున్ కి హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ నివేద థామస్ అల్లు అర్జున్ చెల్లెలుగా నటిస్తున్నారు. హీరో సుశాంత్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు.

ఐతే సుశాంత్ పాత్రపై టాలీవుడ్ లో ఓ ఆసక్తికర పుకారు చక్కర్లు కొడుతుంది.హీరోయిన్ పూజ హెగ్డే కి అన్నయ్యగా సుశాంత్ పాత్ర ఉంటుందట. అలాగే అల్లు అర్జున్ చెల్లెలైన నివేదా థామస్ లవర్ గా కూడా ఆయన పాత్ర ఉంటుందని సమాచారం. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే కుండమార్పిడి పద్దతిలో వీరి పెళ్లిళ్లు ఒకే వేదికపై జరుగుతాయట. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ,వింటుంటే మాత్రం చాలా ఆసక్తిని రేపుతోంది.

సంబంధిత సమాచారం :