“రాధే శ్యామ్” ఆల్బమ్ పై ఆసక్తికర గాసిప్స్.!

Published on Feb 23, 2021 9:00 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ చిత్రం “రాధే శ్యామ్”. పీరియాడిక్ వండర్ ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలే నెలకొన్నాయి. అంతే కాకుండా ఈ భారీ చిత్రానికి సంబంధించి కూడా మేకర్స్ గతంలో చేసిన “సాహో” లానే ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

అదే ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ పై..ఈ సినిమా స్పెషల్ ఆల్బమ్ మాత్రం ఖచ్చితంగా ఒక సంథింగ్ స్పెషల్ గా నిలవడం ఖాయం అని తెలుస్తుంది. మన దక్షిణాది ఆల్బమ్ కు గాను జస్టిన్ ప్రభాకరన్ మెస్మరైజింగ్ ట్యూన్స్ ఇవ్వగా అటు బాలీవుడ్ కు చేసిన ఇద్దరు సంగీత దర్శకులు మిథూన్, మనన్ భరద్వాజ్ లు కూడా చాలా మంచి ట్యూన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

అలాగే ఓవరాల్ గా రాధే శ్యామ్ ఆల్బమ్ మాత్రం ఇండియాలోనే బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ కావడం ఖాయం అని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ చిత్రానికి మాత్రం ఓవరాల్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చేది జస్టిన్ ప్రభాకరనే అన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ టీజర్ లో సంగీతంకు ప్రతీ ఒక్కరూ మైమరచిపోయారో తెలిసిందే. మరి ఫైనల్ అవుట్ ఫుట్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :