పవన్, రానా మాస్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ ఇన్ఫో.!

Published on Jul 9, 2021 5:53 pm IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో అయ్యప్పణం కోషియం రీమేక్ కూడా ఒకటి. దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్న ఈ మాస్ మసాలా ఎంటెర్టైనెర్ పై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంలో పవన్ కి అపోజిట్ గా దగ్గుబాటి రానా సాలిడ్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

మరి మేకర్స్ మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చాలానే మార్పులు చేశారు. ఇక ఈ సాలిడ్ చిత్రంపై ఇప్పుడు మరో ఆసక్తికర ఇన్ఫో వినిపిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న థమన్ ఆల్రెడీ సాలిడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని కంపోజ్ చెయ్యగా మొత్తం మూడు పాటలు సెట్ చేస్తున్నాడట అవి కూడా పవన్ పాడే ఫోక్ సాంగ్ కాకుండా అన్నట్టు తెలుస్తుంది.

అలాగే పవన్ నుంచి అయితే ఒకటి మించే ఉండొచ్చని ముందే చెప్పాడు. మరి ఈ సాంగ్స్ డిజైనింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి మతాల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :