“RRR” ప్రమోషనల్ సాంగ్ పై ఆసక్తికర టాక్.!

“RRR” ప్రమోషనల్ సాంగ్ పై ఆసక్తికర టాక్.!

Published on Jul 25, 2021 9:47 AM IST


మెగాపవర్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. అలాగే దీనిపై ఎన్ని అంచనాలు కూడా ఉన్నాయో తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ అంతా కూడా ఒక అదిరే ప్రమోషనల్ సాంగ్ కోసం కష్టపడుతున్నారు. మరి గ్యాప్ లేకుండా షూట్ జరుపుకుంటున్న ఈ సాంగ్ పై పలు ఆసక్తికర అంశాలే మళ్ళీ వినిపిస్తున్నాయి.

ఈ సాంగ్ లో అగ్ర తారాగణంతో పాటుగా ఇంకొంత మంది సినీ ప్రముఖులు కూడా ఉండనున్నట్టుగా సినీ వర్గాలు చెబుతాయి. ఇప్పటికే స్టార్ హీరోలు ప్రభాస్ మరియు రానా ల పేర్లు కూడా వినిపించాయి. మరి ఈ సాంగ్ లో ఎలాంటి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో చూడాలి. మరి ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు