ఇంట్రెస్టింగ్ : బ్లాక్ బస్టర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కి సీక్వెల్ రూపొందనుందా ?

Published on Sep 25, 2023 11:30 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ హీరోలుగా అంజలి, సమంత హీరోయిన్స్ గా యువ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం 2013లో తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ మల్టి స్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు దీనిని గ్రాండ్ గా నిర్మించారు. జయసుధ, ప్రకాష్ రాజ్, రాణిని హట్టంగడి, రావు రమేష్, కల్పిక గణేష్, తనికెళ్ళ భరణి వంటి నటులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది.

అయితే లేటెస్ట్ టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రకారం అతి త్వరలో ఈ మూవీకి సీక్వెల్ ని తెరకెక్కించాలని ఆలోచనలో నిర్మాత దిల్ రాజు ఉన్నారట. కాగా ఆ ఆలోచన త్వరలో పూర్తిగా కార్యరూపం దాల్చనుందని అంటున్నారు. మరి అది ఎంతవరకు పాజిబుల్ అవుతుంది, అసలు ఎప్పుడు తెరకెక్కుతుంది అనేటువంటి విషయాల పై క్లారిటీ రావాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే అంటున్నారు.

సంబంధిత సమాచారం :